Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌లో కలకలం... ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. స్థానిక ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌లో ఉంటున్న స‌ద‌రు విద్యార్థిని వీణ నిన్న రాత్రి తన గదిలో ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. ఎంత‌కీ త‌లుపులు తెర‌వ‌కపోవ‌డంతో అనుమానం వ‌చ్చిన తోటి విద్యార్థినులు కిటికీ నుంచి చూసి, వెంట‌నే త‌మ కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. వారు పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.
suicide

More Telugu News